
ఐతే ఇంకో టు డేస్ లో లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డు వార్షికోత్సవంలో పాల్గొనబోతున్న ఎన్టీఆర్ కు సంబంధించి ఇప్పుడు రకరకాల వార్తల వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఆస్తి వివరాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సెలబ్రిటీ ఆస్తుల వివరాలను తెలిపే ఒక వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ ఇండియన్ రూపాయలలో రూ.500 కోట్లుగా ఉంది. ఇక నెలవారీగా ఆయన ఆదాయం సుమారుగా మూడు కోట్లకు మించి ఉంటుందని మన దగ్గరున్న సమాచారం.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రేసెంట్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అమెరికాలో ఉండడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆయన తిరిగి రాగానే సినిమా షూటింగ్ మొదలు కాలుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ వర్క్ కూడా పూర్తయింది. ఇక అమెరికా నుంచి ఎన్టీఆర్ తిరిగి రాగానే షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించనున్నారట చిత్రబృందం.
ఇకపోతే ఇందులో హీరోయిన్ గా అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తున్నట్లు అందుకు సంబంధించిన సినిమా పోస్టర్ని కూడా ఇటీవల విడుదల చేశారు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.
ఏదేమైనా ఎన్టీఆర్ మొదట్లో ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బంది పడి స్వాతహాగా ఈ స్థాయి కి ఎదిగ్యారు.ఆయన అభిమానులుగా మేము కోరుకునేది ఏంటంటే ఆయన ఎప్పుడు మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ టాప్ స్టార్స్ గా ఉండలనేది మా అందరికి అభిలాష.