టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150 తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు.

చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తన స్టార్ స్టామినా ను మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు. అలా ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు తిరుగు లేదు అని ఖైదీ నెంబర్ 150 మూవీ తో చిరంజీవి నిరూపించుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించి ... ఈ మూవీ తో కూడా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్టేరు వీరయ్య" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా రీ ఎంట్రీ తర్వాత వరస విజయాలను అందుకుంటున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇలా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చిరంజీవి మరో మూవీ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. తమిళ క్రేజీ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో పని చేయడానికి చిరంజీవి గ్రేట్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: