ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చానల్స్ లో కనిపిస్తూ ఇక యాంకరింగ్ లో దూసుకుపోతుంది ఎవరు అంటే శ్రీముఖి అనే పేరు ముందుగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన వాక్చాతుర్యంతో తన అల్లరితనంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసి ఎంతో మంది యువతను కూడా తన వైపుకు తిప్పుకుంది అని చెప్పాలి.


 ఇక ఇప్పటికే బుల్లితెరపై పలు ఛానల్లలో షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో మరోవైపు అటు సినిమాల్లో కూడా బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి.  అయితే కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలో నటించినప్పటికీ ఎందుకో శ్రీముఖి యాంకర్ గానే ఎక్కువగా గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.  అయితే ఇక ఇప్పుడు బుల్లితెరపై వచ్చిన క్రేజ్ సహాయంతో అటు వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ యాంకరమ్మ. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న బోలా శంకర్ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఒకవేళ ఇక భోల శంకర్ సినిమా  హిట్ అయింది అంటే శ్రీముఖి కెరియర్ ఒక్కసారిగా కీలక మలుపు తిరుగుతుంది అని చెప్పాలి. ఎంతమంది దర్శకనిర్మాతలు ఈ యాంకర్ డేట్స్  కోసం క్యూ కట్టే ఛాన్స్ కూడా ఉంది. అలాగే మరో సీనియర్ హీరో బాలకృష్ణ నటిస్తున్న ఎన్.బి.కె 108 చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది శ్రీముఖి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలోను మంచి పాత్ర దక్కించుకుంది శ్రీముఖి. ఈ సినిమా హిట్ అయింది అంటే ఇక శ్రీముఖి కెరియర్ ఎంతో ప్లస్ పాయింట్ గా మారుతుంది. ఇక ఇప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ ఈ రెండు సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: