పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాలో స్టైల్‌కు, స్వాగ్‌కు తెలుగు ఆడియన్స్ కంటే హిందీ ఆడియన్స్ బాగా ఫిదా అయ్యారు. ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ షూట్‌లో బాగా బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.అల్లు అర్జున్ తన కెరీర్‌లో చాలా అందమైన హీరోయిన్స్‌తో పనిచేశాడు. వారిలో కొంతమంది స్టార్ స్టేటస్ అందుకుంటే.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. పెళ్లి చేసుకుని సెటిలైపోయారు. కొంతమంది హీరోయిన్స్ గురించి అయితే అసలు సమాచారం కూడా లేదు. వారు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. అలా అల్లు అర్జున్ తో నటించి కనుమరుగు అయిన హీరోయిన్లలో భానుశ్రీ మెహ్రా ఒకరు. అల్లు అర్జున్తో వరుడు సినిమాలో ఆడిపాడిన ఈ హాట్ బ్యూటీ ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడం వల్ల.. ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా చాన్సులు రాలేదు. కామియో, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రల్లో కనిపించినా కూడా అవి ఆమెకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు.


అయితే  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్లు అర్జున్ గురించి ఊహించని కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ తనను ట్విట్టర్లో బ్లాక్ చేశాడంటూ చెప్పుకొచ్చింది.అందుకు సంబంధించి స్క్రీన్షాట్ను కూడా ఆ పోస్ట్కు ఆమె యాడ్ చేసింది. దీంతో అల్లు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఈ పోస్ట్ చూసి స్టన్ అయ్యారు.'వరుడు' సినిమా తర్వాత ఇప్పటికీ తనకు అసలు అవకాశాలు రావడం లేదని తెలిపిన భానుశ్రీ.. ఎంతటి కష్టసమయంలోనైనా హాస్యాన్ని వెతుక్కోవడం తాను నేర్చుకున్నట్లు ఆమె తెలిపింది. అందుకు ఉదాహారణగా బన్నీ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత కాసేపటికీ గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ తనను మళ్ళీ అన్బ్లాక్ చేశాడంటూ మరో పోస్ట్ కూడా పెట్టింది ఆమె.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు.వీరిద్దరి మధ్య అసలేం జరిగిందో అర్థం కావట్లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: