శ్రీ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తమన్నా వరసగా సినిమాలు చేస్తూ మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.అయితే ఈ మధ్య తమన్నా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది.అలాగే ఈ ముంబై భామ ఆ మధ్య హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో సన్నిహితంగా కనిపించిన స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ కూడా చేశాయి.

ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ నెటిజన్లు తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

డేటింగ్ వార్తలు రావడంపై స్పందిస్తూ అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియదు కానీ ఆడవాళ్లకు నిజంగా పెళ్లి చేసుకునే కంటే ముందే చాలా సార్లు పెళ్లవుతుంది. మేం ప్రతీ శుక్రవారం పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా పెళ్లి కాలేదని తెలిశాక జనాలు ప్రతీ సారి చాలా మంది వ్యక్తులతో నాకు పెళ్లి చేస్తున్నారు. పుకార్ల ప్రకారం నేను డాక్టర్ నుండి వ్యాపారవేత్త వరకు ఇలా చాలా మందిని పెళ్లి చేసుకున్నానని భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది . ఇక తమన్నా- విజయ్ వర్మ ప్రేమాయణం గురించి వార్తలు చాలానే వచ్చాయి .

సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు వీళ్లద్దరూ కిస్ చేసుకున్నారని, డేటింగ్ చేస్తున్నారన్న న్యూస్యే కనిపించేది. అంతేకాదు ఏకంగా వీరు కిస్ సీన్ అంటూ ఓ వీడియోనే వైరల్ అయింది. అయితే తాజాగా ఆన్స్క్రీన్పై తమన్నా రొమాన్స్ లో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది .. తమన్నా- విజయ్ వర్మ జంటగా లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్సిరీస్ చేస్తున్నారు. ఇదే వీరు కలిసి నటిస్తోన్న మొదటి ప్రాజెక్ట్. ఇది ఇంతకుముందు వచ్చిన లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ . ఈ సిరీస్లో తమన్నా- విజయ్ వర్మ మధ్య చాలా రొమాంటిక్ సీన్లు ఉన్నాయని టాక్ . కచ్చితంగా ఈ సిరీస్లో బోల్డ్ తమన్నాను చూసి ఫ్యాన్స్ షాకవుతారని సమాచారం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తమన్నా ఇందులో అందాలు ఆరబోసిందని అంటున్నారు...ఈ వెబ్ డ్రామాలో తమన్నా మొదటిసారిగా ఓ లిప్లాక్ చేసింది. తమన్నా ఇప్పటివరకు ఇలాంటి సీన్ చేయలేదు. అందాల ప్రదర్శనకు ఎప్పుడూ అడ్డు చెప్పని తమన్నా కిస్కు మాత్రం ఇప్పటివరకు నో చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తన రూమర్ బాయఫ్రెండ్తో మాత్రం ఆన్స్క్రీన్లో ఘాటు ముద్దు సీన్లలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: