
కొంతమంది డాక్టర్ చదువు చదివి ఇక తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా వేరే వృత్తి నుంచి అటు ఇండస్ట్రీలోకి వచ్చిన వారిని ఎంతోమందిని చూశాము. కానీ ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత మరో వృత్తిలో సెటిల్ అయిన వారిని మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక నటుడు ఒకప్పుడు తన కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించి ఇక ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా మారిపోయాడు అని చెప్పాలి. అతను మరెవరో కాదు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అయిన గణపతి.
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కు చెందిన గణపతి అదే మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా బాధ్యతలు తీసుకున్నారట. 1998లో డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటినుంచో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జబర్దస్త్ గణపతి కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ జాబ్ కొట్టేసాడట. హైపర్ ఆది టీంలో చాలా బొద్దుగా ఉంటూ కామెడీ పంచలతో తెగ నవ్వించారు గణపతి. చాలా స్కిట్లలో ఆది భార్యగా లేడీ గెటప్ లో కనిపించి అలరించారు అని చెప్పాలి. ఆది జబర్దస్త్ మానేశాక గణపతి కూడా బయటికి వచ్చేసారు. ఇక ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ టీచర్ గా మారడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.