రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రోజుల క్రితమే ఆది పురుష్ అనే మూవీ కి సంబంధించిన తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ మూవీ కి అత్యంత భారీ "వి ఎఫ్ ఎక్స్" పనులు ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఈ చిత్ర బృందం చాలా రోజులను కేటాయించింది  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి అనేక పోస్టర్ లను మరియు ఒక టీజర్ ను విడుదల చేసింది.

ఇందులో కొంత కాలం క్రితం ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమా అవుట్ ఫుట్ ను మరింత అద్భుతంగా రావడం కోసం కొంత సమయాన్ని తీసుకొని ఈ సినిమా అవుట్ పుట్ ను మరింత మెరుగ్గా చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 174 నిమిషాల భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ నిర్మించిన ఆది పురుష్ మూవీ IMAX మరియు 3D ఫార్మాట్ లలో విడుదల కానుంది. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటించింది. అజయ్ – అతుల్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.  సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: