అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ నెల 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా చాలా డిఫరెంట్ గా చేస్తూ రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ మూవీ యూనిట్ ఈ రోజు వరంగల్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. దానికి నాగర్జున ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇది ఎలా ఉంటే ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో మరో భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ప్రయత్నాలు ఏజెంట్ చిత్ర బృందం చేసినట్లు ... అలాగే ఏజెంట్ మూవీ కి సంబంధించి హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రావడానికి ఓకే చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అఖిల్ "ఏజెంట్" మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: