సంక్రాంతి తరువాత చాల సినిమాలు విడుదల అయినప్పటికీ ఎక్కడా వాటికి ధియేటర్ల కొరత ఏర్పడలేదు. సమ్మర్ రేస్ ‘దసరా’ తో మొదలైంది. ఆతరువాత వచ్చిన ‘రావణాసుర’ ‘శాకుంతలం’ ఫెయిల్ అవ్వడంతో ఎక్కడా ధియేటర్ల సమస్య ఎర్పడలేదు. అయితే ఆతరువాత విడుదలైన ‘విరూపాక్ష’ సూపర్ సక్సస్ కావడంతో ఆసినిమాకు ధియేటర్లు పెరుగుతాయి కానీ తగ్గే ఛాన్స్ లేదు.


దీనితో ఈవారం విడుదలకాబోతున్న అఖిల్ ‘ఏజెంట్’ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 లకు ధియేటర్లు సద్దుబాటు చేయడం ఒక సమస్యగా మారింది అన్నవార్తలు వస్తున్నాయి. ఈరెండు సినిమాలకు ధియేటర్లు ఏదోవిధంగా సద్దుబాటు చేసినప్పటికీ మే మొదటివారంలో విడుదలయ్యే గోపీచంద్ ‘రామబాణం’ అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలకు ఖచ్చితంగా ధియేటర్ల సమస్య వస్తుందని అంటున్నారు.


ఆపై మే రెండవ వారంలో రాబోతున్న నాగచైతన్య ‘కస్టడీ’ మూవీకి కూడ ఎక్కువ ధియేటర్లు కావలసి వస్తుంది. అదేరోజు విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ ఆతరువాత ‘అన్నీ మంచి శకునములే’ విడుదల కాబోతోంది. ఈమూవీ ‘సీతారామం’ రేంజ్ లో ఫ్యామిలీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది అన్నప్రచారం జరుగుతోంది. దీనితో విడుదల అవుతున్న ఇన్ని మీడియం రేంజ్ చిన్న సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి అన్నపరిస్థితిని బట్టి ధియేటర్ల సమస్య కొనసాగుతుందని లేదంటే అంతా సజావుగానే జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి.


ఈ సంవత్సరం సమ్మర్ రేస్ కు 100 కోట్ల భారీ కలక్షన్స్ తో నాని ఊపు ఇస్తే ఆ స్పీడ్ ను సాయి ధరమ్ తేజ్ కొనసాగించడంతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఇప్పుడు ఈ బాధ్యతను అక్కినేని బ్రదర్స్ అఖిల్ నాగచైతన్య లు ఎంతవరకు కొనసాగిస్తారో అన్న సందేహాలు అందరిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు భారీ బడ్జెట్ తో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ‘ఉగ్రం’ సినిమా లపై కూడ అంచనాలు బాగా ఉండటంతో టాప్ హీరోలు లేని లోటు వీరంతా కవర్ చేస్తారు అనుకోవాలి...



మరింత సమాచారం తెలుసుకోండి: