దాదాపుగా ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే.. అయితే ప్రభాస్ నటించిన చిత్రాలు సక్సెస్ కాక చాలా కాలం అవుతొంది..చివరిగా బాహుబలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ రేంజ్ లో సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది మాత్రం కచ్చితంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని వరుసగా తన సినిమాలను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ తో వస్తున్నారు ప్రభాస్. ప్రభాస్ నటించిన చిత్రాలలో పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీత పాత్రలో కృతి సనన్ , రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. గతంలో ఈ సినిమా టీజర్ విడుదల చేయగా ట్రోల్ కి గురైంది..అయితే ఇప్పుడు అంతకుమించి పాజిటివ్ వాతావరణం నెలకొందిపేలా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు బాగానే ఆసక్తి పెంచేలా కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా మేకర్స్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.


ఈ సినిమాలో జానకి దేవిగా నటిస్తున్న కృతి సనన్ పై ఒక పోస్టర్తో సహా మోషన్ పోస్టర్ తేజరిని విడుదల చేయడం జరిగింది. అయితే ఇది కూడా డెఫినెట్గా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ని అందించే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మోషన్ పోస్టర్ టీజర్ విజువల్స్ తో బాగా రియలిస్టిక్ గా కనిపిస్తోంది. ఇందులో అజయ్ అతుల్ మ్యూజిక్  అద్భుతంగా అందించారు. ఇప్పటివరకు విడుదలవుతున్న అప్డేట్ లతో ఈ సినిమాపై భారీగానే క్రేజ్ పెరిగేలా ఉంది తప్ప తగ్గేలా కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూన్ 16వ తేదీన.. 3d 4d తో పాటు పలు భాషలలో కూడా విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: