ఇండియా లోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి మణిరత్నం గురించి ప్రత్యేకంగా ఇండియన్స్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకులం ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరమే విడుదల అయింది. ఈ మూవీ రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లు లభించాయో తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 80 లక్షల కలెక్షన్ లు దక్కగా ,  సీడెడ్ ఏరియాలో 13 లక్షలు ,  యు ఏ ఏరియా లో 9 లక్షలు , ఈస్ట్ లో 8 లక్షలు , వెస్ట్ లో 6 లక్షలు ,  గుంటూరు లో 8 లక్షలు ,  కృష్ణ లో 8 లక్షలు ,  నెల్లూరు లో 5 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.40 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 10.50 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సినిమా ఇంకా 9.10 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటుంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: