టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రియమణిమూవీ లో ముఖ్యమంత్రి పాత్రలో నటించింది. అరవింద స్వామి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇళయరాజా , యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సినిమా రెండు రోజులకు గాను నైజాం ఏరియాలో 1.03 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సిడెడ్ ఏరియాలో 33 లక్షలు , యూఏ లో 31 లక్షలు , ఈస్ట్ లో 19 లక్షలు , వెస్ట్ లో 14 లక్షలు , గుంటూరు లో 28 లక్షలు , కృష్ణ లో 20 లక్షలు , నెల్లూరు లో 14 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 2.62 కోట్ల షేర్ , 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు రోజులకు గాను 11 లక్షలు , ఓవర్ సీస్ లో 80 లక్షలు ,  తమిళ్ లో 15 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. 

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 3.68 కోట్ల షేర్ , 7.15 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 24.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 25 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇంకా ఈ మూవీ 21.32 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: