సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాస్ మహారాజా పోటీపడబోతున్నాడా..అంటే ఇండస్ట్రీ వర్గాలు ఔననే అంటున్నాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర ఇలా వరుసగా హిట్లు పడడంతో మాస్ రాజా వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టేశాడు. వీటిలో ఒకటి వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు ఒకటి కాగా మరొకటి ఈగల్. హీరో నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య చిత్రాన్ని తీసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా రెడీ ఔతోంది.

రవితేజా టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలు ఆ మధ్య అనౌన్స్ చేశారు. అయితే ఇదే టైమ్ కు మహేష్ బాబు, త్రివిక్రమ్ ఎస్ ఎస్ ఎంబీ 28 రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. కానీ, షూటింగ్ అనుకున్న విధంగా జరగకపోవడంతో ఎస్ ఎస్ ఎంబీ 28ను నిర్మాతలు 2024 సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. రవితేజా తన టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని దసరా టార్గెట్ గా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తంగా ఎస్ ఎస్ ఎంబీ28తో టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వార్ తప్పిపోగా..ఇప్పుడు మరో సినిమాతో రవితేజా సూపర్ స్టార్ తో బాక్సాఫీస్ దగ్గర కాలుదువ్వేందుకు సిద్ధం అయ్యాడు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సైలెంట్ గా రెడీ ఔతున్న ఈగల్ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ K, ఎస్ ఎస్ ఎంబీ 28 సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు హాలీవుడ్ మూవీ జాన్ విక్ ఆధారంగా రూపొందుతన్న ఈగల్ సినిమా కూడా సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఈగల్ సినిమా అనుకున్న విధంగా సంక్రాంతికి వస్తే సూపర్ స్టార్ తో బాక్సాఫీస్ వైరం తప్పదు. మొత్తంగా, 2024 సంక్రాంతి పై రవితేజా కూడా కన్నేయడంతో పండగ పోరు రసకందాయంలో పడింది. పండగ దగ్గర పడే కొద్ది మరికొన్ని సినిమాలు కూడా బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఏదిఏమైనా వచ్చే సంక్రాంతికి మన బాక్సాఫీస్ దగ్గర సినీ పుంజుల పోరు గట్టిగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: