ఇటీవల కాలంలో హీరోయిన్స్‌తో పాటు సమానంగా తెలుగు యాంకర్స్ కూడా క్రేజ్ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యాంకర్స్ తాము హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోమనే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. సుమను పక్కన పెడితే.. రష్మీ, శ్రీముఖి, వర్షిణి,విష్ణు ప్రియ, అనసూయ వంటి వారు .. యాంకరింగ్‌తో పాటు, తమ అంద చందాలతో కూడా అభిమాలను అలరిస్తున్నారు. ఇక యాంకర్‌‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్స్‌ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్‌ చేయడంలో అమ్మడు దిట్ట. మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో విష్ణు ప్రియ వార్తల్లో నిలిచింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఆ షోతో ఫుల్ పాపులరిటీ: కెరీర్ ఆరంభంలో విష్ణు ప్రియ కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసింది. ఆ తరువాత ఈటీవీలో' పోవే పోరా' అనే షోతో యాంకర్‌‌గా అవకాశం దక్కింది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ ఒక్క షో విష్ణు ప్రియ లైఫ్‌నే మార్చేసింది. 'పోవే పోరా' షోతో విష్ణు ప్రియకు మంచి గుర్తింపు లభించింది. తద్వారా పలు షోలలో యాంకరింగ్ చూస్తూనే , వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.

హీరో అంటే క్రష్: 'పోవే పోరా' షో టైంలోనే సుడిగాలి సుధీర్‌, విష్ణు ప్రియల మధ్య ఎఫైర్ ఉందనే రూమార్స్ తెర మీదకు వచ్చాయి. దీనిపై ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాము మంచి స్నేహితులం మాత్రమే అని .. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. హీరో అఖిల్ అంటే విష్ణు ప్రియకు పిచ్చి. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అఖిల్ పేరును తన చేతి మీద ట్యాటూ కూడా వేయించుకుంది ఆ హ్యాట్ యాంకర్.

సోషల్ మీడియాలో యమ హాట్‌గా: ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటేస్ట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంటుంది. ఆ మధ్య క్లీవేజ్‌తో తన పరువాల పదనును యువతకు పరిచియం చేసింది. తన హాట్ ఫిగర్‌తో సోషల్ మీడియాను ఊపేసింది. విష్ణు ప్రియ చేసిన ఆ ఫొటో షూట్ సోషల్ మీడియలో బాగానే వైరల్ అయింది.

సీనియర్ హీరోతో ప్రేమయాణం: అయితే తాను ఓ సీనియర్ హీరోతో ప్రేమలో పడ్డానని ఇటీవల చెప్పి అందరికి షాకిచ్చింది. ఆయన వయస్సు నాకు సరిపోకపోవచ్చని అందరు అనుకుంటారని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. తాను సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని విష్ణుప్రియ వెల్లడించారు.ఈ ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది.ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ అని వెల్లడించింది. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు.

సుమ షోలో బోల్డ్ కామెంట్స్: బలగం వేణు, కమెడియన్ ధనరాజ్,చమక్ చంద్రలతో కలిసి విష్ణుప్రియ సుమ అడ్డా షోలో హల్ చల్ చేసింది. మంచి టాపిక్ మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అంటూ షోకి వచ్చిన వారిని సుమ అడగ్గా..ఫస్ట్ లవ్ అనేది మంచి టాపిక్ ఎందుకు అవుతుందని...ఇంటికి వెళ్తే.. బాధకరమైన టాపిక్ అవుతుందని బలగం వేణు సరదాగా కామెంట్ చేశారు. ఇక పెళ్లి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఏంటని ప్రశ్నించగా..దీనికి వెంటనే స్పందించిన విష్ణుప్రియ ..శోభనం అని బదులిచ్చింది. శోభనం గుర్తుకు వచ్చింది కాని..తాళి బొట్టు గుర్తుకు రాలేదా అంటూ బలగం వేణు , విష్ణుప్రియకు కౌంటరిచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: