నందమూరి నట సింహం బాలయ్య బాబు  ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా  ఈ చిత్రం నిన్నటితో షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆలాగే ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.  కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి సంబంధించి చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటల 50 నిముషాలకు  సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేశారు.  అయితే   ఈ చిత్రానికి  'రూలర్' అనే టైటిల్ నిర్ణయించినట్లు  వార్తలు వచ్చాయి. మరి అదే టైటిల్ ను ప్రకటిస్తారా లేక కొత్త టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.  `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ - బాలయ్య  హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న  ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డనున్నారు.  

కాగా షూటింగ్ పూర్తి అయినా ఇంకా ప్యాచ్ వర్క్ ఉందని మరో నాలుగు రోజులు షూట్ చేయనున్నారని  తెలుస్తోంది. ఈ ఫ్యాచ్ వర్క్  షెడ్యూల్ లో  ఫ్యామిలీ  సన్నివేశాలను షూట్ చేయనున్నారు.  ఈ సన్నివేశాల్లో బాలయ్య - భూమిక చావ్లా మధ్య వచ్చే సీన్స్ తో పాటు  కొన్ని కామెడీ సీన్స్ కూడా  ఉంటాయట. పైగా  ఈ సీన్స్ లో  జయసుధ, రావు రమేష్ కూడా ఉన్నారట.  ఇక ఈ సినిమాలో  లుక్స్ కోసం బాలయ్య రోజుకి ఐదు గంటలు వ్యాయామం చేశారు. ఈ వయసులో కూడా  బాలయ్య ఆ రేంజ్ లో  కష్టపడటం నిజంగా గ్రేటే.  ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన  సోనాల్ చౌహాన్ అండ్  వేదిక  హీరోయిన్లుగా  నటించనున్నారు.  అయితే  వేదిక  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  

అలాగే ఓ కీలకమైన పాత్రలో  నమిత కనిపించనుంది.  నమితది  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..  ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.  ఇక  ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు  పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు.  బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: