జబర్దస్త్ నుండి నాగబాబు ఎగ్జిట్ అయ్యాక ఆయన ప్లేస్ లో ఎవరిని పెట్టాలా అన్న కన్ ఫ్యూజన్  మల్లెమాల టీం కు ఏర్పడింది. పోసాని, నరేష్, ఆలి ఇలా ఒకటి రెండు వారాలకు తీసుకురావడం వాళ్లు మేం చేయలేమని చెప్పి వెళ్లడం జరిగింది. ఒక ఐదారు సీజన్లు డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, జానిలను కూడా కామెడీ స్కిట్ జడ్జులుగా చేశారు. అయితే ఫైనల్ గా వాళ్లకి నాగబాబు బదులుగా నాగూర్ బాబు అదేనండి మనో దొరికాడు. కొన్ని ఎపిసోడ్స్ గా మనో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనబడుతున్నాడు. దాదాపుగా జడ్జ్ గా ఆయన ఫైనల్ అయినట్టే.

 

ఇక జబర్దస్త్ కు పోటీగా పెట్టిన అదిరింది షోలో నాగబాబు పక్కన సీట్ లో ప్లేస్ దక్కించుకున్నాడు నవదీప్. అక్కడ వారు చేసే పంచులకు నవదీప్ పడి పడి మరి నవ్వుతున్నాడు. అదిరింది షోలో రీసెంట్ గా యాంకర్ ను మార్చగా జడ్జ్ గా నవదీప్ కొనసాగేలా ఉన్నాడు. అక్కడ మనో.. ఇక్కడ నవదీప్ ఇద్దరు భలే సెట్ అయ్యారు. అదిరింది షో మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ దానికి అలవాటు పడుతున్నారు.

 

జబర్దస్త్ కాన్సెప్ట్ తోనే జీ తెలుగులో వస్తున్న అదిరింది మాటల్లేవ్.. మాట్లాడుకోటాల్లేవ్ షోలో నాగబాబు స్ట్రాంగ్ జడ్జ్ కాగా పక్కన ఉన్న నవదీప్ కు అంత వెయిట్ ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఆయన బదులుగా ఒక ఫీమేల్ జడ్జ్ ను పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు. జబర్దస్త్ లో అయితే నాగబాబు బదులుగా వచ్చిన మనో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మరి ఈ ఇద్దరు ఆయా షోలకు ఏమాత్రం క్రేజ్ తెస్తారో చూడాలి. రెండు షోలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో వాళ్ళే జడ్జ్ లుగా కొనసాగేలా ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: