టాలీవుడ్ లో తమన్నా కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె హీరోయిన్ గా వచ్చి దాదాపు 15 ఏళ్ళకు పైగానే అవుతుంది. దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన ఆమె సినిమాలు చేసి మెప్పించింది, వరుస అవకాశాలతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు కూడా తెచ్చుకుంది తమన్నా. అయితే ఆ తర్వాత ఆమెను కొన్ని ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. ఇక ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాలో ఆమె ఒక సాంగ్ చేసింది. ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 

అయితే మూడు పదుల వయసు దాటేస్తున్నా సరే ఆమె మాత్రం పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో టాలీవుడ్ జనాలు అసలు ఆమె పెళ్లి చేసుకుంటుందా లేదా అనే దాని మీద చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యు లో ఆమెను ఒక ప్రశ్న అడిగారు. పెళ్లి చేసుకుంటే ఎలాంటి వారిని చేసుకుంటారని ఆమెను ఒక ప్రశ్న వేసారు. దీనికి స్పందించిన తమన్నా... ఒక వేళ తన పెళ్లికి స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ప్రభాస్‌తో పాటు ఆ ఇద్దరు  హీరోలను  స్వయంవరానికి పిలుస్తానని ఆసక్తికర విషయం చెప్పింది. 

 

ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ తో ఆమె చేసింది ఒకటే సినిమా. ఆ సినిమా బాహుబలి. వీరి మధ్య వచ్చిన ఆ చిన్న చిన్న సన్నివేశాలు ఒక పాట సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ లోపు ప్రభాస్ ఆమెకు ఏ విధంగా నచ్చేసాడో తెలిదు. కాగా సాహో సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: