బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గత మూడేళ్ళుగా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు. సామాజిక అంశంతో ఎక్కువగా కథ లని ఎంచుకుంటూ తక్కువ బడ్జెట్ తో సినిమాలని తీసి భారీ వసూళ్ళని దక్కించుకుంటున్నారు అక్షయ్ కుమార్ తో సినిమా తీస్తున్న మేకర్స్. ఒక కథ కి ఒక కథ కి సంబంధం లేకుండా స్టార్ అన్న ఇమేజ్ ని పక్కన పెట్టి భారి బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్ సినిమా అనే లెక్కలు వేసుకోకుండా సినిమాలని చేసుకుంటూ వెళుతున్నాడు అక్షయ్ కుమార్. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాల్ షారుఖ్ కాన్ లాంటి స్టార్ హీరోలున్నప్పటికి వాళ్ళతో సంబంధం లేకుండా పోటీ పడకుండా తన పాటికి తను సక్సస్ లను వెనకేసుకుంటూ సాగుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ కిలాడి హీరో నాలుగైదు సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు.

 

ఇక తాజాగా ఈ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా 'సూర్యవంశీ' త్వరలో విడుదలకి సిద్దంగా ఉంది. కానీ ఈ సినిమాకి కరోనా ఎఫెక్ట్ తగిలింది. దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమాను ఇలాంటి సమయంలో విడుదల చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అక్షయ్ కుమార్ బృందం సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కావాల్సిఉంది. కానీ, కరోనా ఎఫెక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర విడుదలను వాయిదా వేసి మళ్ళీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.

 

'సూర్యవంశీ' సినిమాని ప్రేక్షకుల కోసం ఎంతో కష్ఠపడి తెరకెక్కించాము. ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అంద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో మాకు ఈ సినిమా మీద బాగా అంచనాలు పెరిగాయి. కానీ కరోనా దేశ ప్రజలందరిని వణికిస్తున్న కారణంగా రిలీజ్ చేయడం లేదని తెలిపారు. సరైన సమయంలో 'సూర్యవంశీ' మీ ముందుకు తీసుకు వస్తాము. పరజల క్షేమం, వాళ్ళ భద్రత మాకు చాలా ముఖ్యం.. వాళ్ళ తరవాతే ఏదైనా... అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. మొత్తానికి కరోనా ఎఫ్ఫెక్ట్ ఇండియా మీద బాగా పడింది. అల్లకల్లోలం అవుతూ అతలాకుతలం చేస్తుంది. కోట్లలో నష్టమూ వాటిల్లుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: