విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగులో ఉన్న అందరి హీరోలకెల్లా యూత్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ కి లేడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ. అతని సినిమా మొదటి రోజు ఆటకి లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మందే ఉంటారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ మోస్ట్ డిసైరబులు మెన్ 2019 లో మొదటి స్థానంలో నిలిచాడు విజయ్. అర్జున్ రెడ్డి విజయంతో అతని స్థాయి పూర్తిగా మారిపోయింది. 

 

ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస హిట్ల తర్వాత అతని సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ  అంచనాల వల్లే ప్రస్తుతం అతడికి బ్యాడ్ ఫేస్ ఎదురైంది. గత కొన్ని రోజులుగా విజయ్ ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. విజయ్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ ఘోర పరాజయం పాలైంది. దాని తర్వాత ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

 

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల విజయ్ కి బాగా చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి సినిమాని దేవరకొండ ఎందుకు చేశాడు అంటూ అతని అభిమానులు సొషల్ మీడియా వేదికగా అతనిని ప్రశ్నించారు. మరి అంతలా డిజాస్టర్ అనిపించుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాలీవుడ్ లోకి వెళ్ళనుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చూసి హిందీ ఆడియన్స్ కి ఈ కథ వర్కౌట్ అవుతుందని భావించాడట.

 

హిందీ ఆడియన్స్ ఇలాంటి కథల్ని ఆక్సెప్ట్ చేస్తారని భావించి రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం అందుతోంది. కొన్ని కొన్ని సార్లు మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మరోచోట హిట్ అవుతుండడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇక్కడ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాలీవుడ్ హిట్ అయ్యింది. అలాగే ఈ వరల్డ్ ఫేమస్ లవర్ నీ బాలీవుడ్ జనాలు ఆదరిస్తారా లేదా చూడాలి. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారికంగా సమాచారమైతే రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: