మల్టీస్టారర్ ట్రెండ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సినీ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి వస్తున్నదే. అప్పటి జనరేషన్ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణ కృష్ణం రాజు, శోభన్ బాబు ఇలా అందరు హీరోలు కలిసి నటించిన వారే. కానీ ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం మల్టీస్టారర్ మూవీస్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ మరియు ఇతర పరిశ్రమలలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయడం తరుచుగా చూస్తూ ఉంటాం. కానీ మన టాలీవుడ్ స్టార్ హీరోలు అలా కాదు, ఇమేజ్, స్క్రీన్ స్పేస్, ఫ్యాన్స్ ఒపీనియన్స్ అనే అనేక విషయాలు అడ్డు వస్తాయి. ఐతే కొన్నాళ్లుగా ట్రెండ్ మారింది, స్టార్ హీరోల మధ్య మల్టీ స్టారర్ లు చిన్నగా ఊపందుకుంటున్నాయి. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరోలు చరణ్ ల మల్టీ స్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఇందుకు నిదర్శనం. వీరిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తారని కలలో కూడా ఎవరు ఉహించి వుండరు. 'ఆర్ ఆర్ ఆర్' తో దర్శకుడు రాజమౌళి దానిని సాధ్యం చేశాడు.

 

IHG

 

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కలిసి మల్టీ స్టారర్ చేస్తే చూడాలని సినీ అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఆ మధ్య రాజకీయాల వైపు మళ్ళిన పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ప్రకటించడంతో.. ఇది ఎప్పటికీ కుదరని కాంబినేషన్ అని అందరూ అనుకున్నారు. అయితే పవన్ ఈ ఏడాది సినిమాలలోకి కంబ్యాక్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ పై మళ్ళీ హోప్స్ పెరిగాయి. దీనికి తోడు మహేష్ మెగా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కుదిరితే వీరిని ఒప్పించడం అంత కష్టం ఏమి కాదు. ఈ మధ్య మహేష్ బాబు నటించిన 'యువరాజు' సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆ మూవీ ఓపెనింగ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేసాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ టాప్ హీరోలు నాగార్జున వెంకటేష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఫోటోలను చూసిన సినీ లవర్స్ వీళ్లిద్దరు కలిసి నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. 

 

IHG's Eyeing for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH BABU' target='_blank' title='mahesh babu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh babu</a> and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> Kalyan!, IHGs Eyeing for ...

మరింత సమాచారం తెలుసుకోండి: