కరోనా భయంతో ప్రపంచమంతా గజగజా వణికిపోతుంటే వారికి ధైర్యం చెప్పేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ధైర్యం నింపేందుకు సెలబ్రిటీలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ కష్టకాలంలో తీసుకోవాల్సి జాగ్రత్తలకు సంబంధించి చాలా వీడియోలను రూపోందించి పోస్ట్ చేశారు సెలబ్రిటీ.
ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన వంతుగా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాడు. వరుసగా సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో సందేశాలు ఇస్తున్నాడు. అంతా ఇంటి పట్టునే ఉండాలని చెపుతూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా మరోసారి తనలోని ఓ వర్సటైల్ టాలెంట్‌తో అలరించనున్నాడు భాయ్.
ప్రజల్లో అవగాహన కలిగించేందుకు స్వయంగా తానే ఓ పాటన రాసి పాడాడు. ఈ పాట సోమవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ టీజర్‌ను రిలీజ్ చేశాడు సల్మాన్. ప్రస్తుతం భాయ్ తన పాన్వెల్ ఫాం హౌస్‌లో ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో అక్కడి నుంచే రాధే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు.
View this post on InstagramSo I’m posting from my handle to let you know that tmmrw on my youtube channel, mine kya? It’s ours! Song out tmrw on it, hope u can handle it. #PyaarKaronaOutTomorrow @thesajidwajid @adityadevmusic @hussain.dalal @believe_india @saajan_singh23 @abhiraj88 #StayHome #StaySafe #StayStrong #Lockdown #newmusic #Coronavirus #IndiaFightsCorona