అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. అల వైకుంఠపురములో ద్వారా నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకున్న త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రాయలసీయ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.

 

అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా అన్నప్పటి నుండి ఏవేవో ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు. స్క్రిప్టు ఇంకా పూర్తి కాకముందే ఈ సినిమాజోనర్ లో ఉంటుందనే వార్తలు జోరందుకున్నాయి.

 

మొన్నటి వరకూ ఈ సినిమా పొలిటికర్ థ్రిల్లర్ గా ఉండనుందని అన్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా టైటిల్ అయినను పోయిరావలె హస్తినకు అయి ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ యంగ్ అండ్ స్టైలిష్ కార్పొరేట్ దిగ్గజంగా చూపించనున్నాడని టాక్. బిసినెస్ వరల్డ్ లో సక్సెస్ ఫుల్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా ఎన్టీఆర్ లుక్ ఆటిట్యూడ్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. 

 

ఇప్పటి వరకు ఎన్టీఆర్ బిజినెస్ మేన్ గా కనిపించిన సినిమాలు చాలా తక్కువ. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందన్నది అనుమానమే. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. ఇప్పటి వరకూ మనం చూడని విధంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్సినిమా ఉండనుందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చాలా కొత్తగా చూపిస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: