పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అయన ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.. పవన్ సినిమా అంటే బాక్సాఫీజు కళకళలాడుతుంది. హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా పవర్ స్టార్ బొమ్మ మొదటి రెండు మూడు రోజులు వసూళ్ల భీభత్సం సృష్టిస్తాయి. తొలిప్రేమ తమ్ముడు బద్రి నుండి అజ్ఞాతవాసి వరకు యూత్ ఆడియెన్స్ పవన్ అంటే ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ సినిమాల్లో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో మొదటి సాంగ్ దేశానికి సంబంధించి ఉంటుంది. 

 

బద్రి సినిమాలో ఐయామ్ యాన్ ఇండియన్ సినిమా నుండి ఖుషీలో ఏ మేరా జహాన్ అంటూ యువతకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంటాడు పవన్. అంతేకాదు తన ప్రతి సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేలా చూసుకుంటాడు. తన సినిమాల్లో దేశం మీద తన ప్రేమని చూపిస్తుంటారు పవన్ కళ్యాణ్ అందుకే దగ్గర ఉంది మరి అలాంటి లిరిక్స్ కావాలని అడిగి రాయించుకుంటాడట. పవర్ స్టార్ సినిమా అనగానే అలాంటి ఒక సాంగ్ పక్కా ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యేలా చేశాడు,

 

అయినా దేశం గురించి మాటల్లోనే.. పాటల్లోనో చెబితే తెలుస్తుందా అనుకోవచ్చు. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ద్వారా ఒక విషయాన్ని చెప్పిస్తే యాడ్ ఎక్కువమందికి రీచ్ అవుతుందని దర్శక నిర్మాతలు ఇలా ప్లాన్ చేస్తుంటారు. సినిమా కథ కథనాలతో పాటుగా సాంగ్స్ లో కూడా ప్రత్యేకత చూపించే పవన్ సినిమాలో ఎక్కడో ఒకచోట స్ఫూర్తి నింపే సాంగ్ ఉండాలని స్పెషల్ గా కోరుతాడట. అందుకే పవన్ సినిమాలో అలంటి ఒక సాంగ్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి సాంగ్స్ సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతాయని చెప్పొచ్చు.          

మరింత సమాచారం తెలుసుకోండి: