బన్నీతో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నాడు సుకుమార్ . ఇంటెలెక్చువల్ మేకింగ్ కాకుండా కామన్ ఆడియన్ కి రీచ్ అయ్యేలా సమ్ థింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్ ని సరికొత్తగా ప్రజెంట్ చెయ్యబోతున్నాడు సుకుమార్ . అసలే టైమ్ టేకింగ్ అనుకున్న ఈ సినిమాకి   లాక్ డౌన్ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది. దీంతో పాటు ప్రొడ్యూసర్లు ఇచ్చిన డెడ్ లైన్ తో  సుకుమార్ ఫుల్ ప్రెషర్ లో ఉన్నాడట.

 

కెరీర్ లో ఫస్ట్ టైమ్ బన్నీ ఎక్స్ పెరిమెంట్ కి రెడీ అయ్యాడు. అంతకుముందెప్పుడూ కనిపించని క్యారెక్టర్లో కొత్తగా పుష్ప గా కనిపించబోతున్నాడు. సుకుమార్ బన్నీ తో అంతకుముందే ఆర్య, ఆర్య 2 చెయ్యడం, సినిమాలు మంచి హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ గా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కబోతున్న ఈ పుష్ప్ సినిమా మీద కూడా విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ లో.


 
ఒక పక్క ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో పాటు ఇప్పుడుసుకుమార్ కి మరో టెన్‌షన్ యాడ్ అయ్యింది. 3 నెలల క్రితమే స్టార్ట్ అయిన ఈ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్  సినిమా లో ఇప్పటివరకూ హీరో బన్నీ జాయిన్ అవ్వలేదు . మొన్నీ మద్యే లుక్ టెస్ట్ ఫైనల్ చేసి టైటిల్ రివీల్ చేశాడు సుక్కు . లుక్ కోసమే ఇన్నిరోజులు టైమ్ తీసుకున్నాడు ..సినిమాకు కూడా చాలా టైమ్ పట్టేలా ఉంది అనుకున్నారు అందరూ. అంటే అనుకున్నారు..ఈ సినిమా డీటెయిల్డ్ గా  తియ్యాలి లేకపోతే  క్వాలిటీ పోతుందని తన స్టైల్లో చెప్పాడు సుక్కు.

 

సుకుమార్ కి ఇప్పుడు పుష్ప్ ని అంత నెమ్మదిగా తీసే ఛాన్స లేదు . ఎందుకంటే ఆల్రెడీ విలన్ గా అనుకున్న విజయ్ సేతుపతి డేట్స్ క్లాష్ తో తప్పుకున్నాడు . ఇంతవరకూ హీరో పార్ట్ షూటింగ్ స్టార్టవ్వలేదు . ఇంతలో కరోనా తో లాక్ డౌన్ అయ్యి షూటింగ్స్ ఆగిపోయాయి. సో..ఇప్పటికే వేసిన షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయి. అందుకే .. అంతకుముందులా నిదానంగా చేస్తే కుదరదు.. ఎట్టి పరిస్తితుల్లో సినిమాని త్వరగా ఫినిష్ చెయ్యాలని ప్రొడ్యూసర్లు అల్టిమేటమ్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

 

తొందరగా అంటే అలా ఇలా కాదు. ఏక్ దమ్ ..ఒకటే షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చెయ్యాలని, లేకపోతే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని, ఇప్పటికే ఈసినిమాకి భారీ బడ్జెట్ కేటాయించిన మైత్రి మూవీస్ చెబుతోందట. అసలే ప్రతి చిన్న సీన్ ని లాజికల్ గా తీసే సుకుమార్ కి..ప్యాన్ ఇండియా మూవీ పుష్ప ని సింగిల్ షెడ్యూల్ లో చెయ్యడం కష్టమే. ఈజీగా సంవత్సరం పైగా టైమ్ పట్టే ఈ సినిమాని ఎట్టి పరిస్తితుల్లో నెక్ట్స్ సమ్మర్ కి రిలీజ్ చెయ్యాల్సిందే అని  ఇప్పటికే డెడ్ లైన్ పెట్టేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: