సాధారణంగా మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు.. కొంత మంది అచ్చం మన ముఖాన్ని అచ్చుగుద్దినట్టే కనిపస్తుంటారు. అయితే ఇది సామాన్యుల విషయం అయితే పెద్దగా పట్టించుకోరు కానీ.. సెలబ్రెటీల ముఖాన్ని పోలి ఉంటే మాత్రం వారు తెగ పాపులర్ అవుతారు.  ఈ మద్య మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ని పోలిన రూపంతో సెలబ్రిటీగా మారింది  ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘సింహా’ లాంటి సినిమాల్లో నటించిన స్నేహా ఉల్లాల్ అందుకే ఈ అమ్మడిని ‘జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌’ అనేవారు.  ఇలా ఎంతో మంది నటుల డూప్ లను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం.  తాజాగా మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ని పోలిన యువతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మ‌రియా ప్రిన్స్ అనే కేర‌ళ అమ్మాయి కీర్తి సురేశ్ ముఖ‌క‌వ‌ళిక‌లు క‌లిగి ఉన్న‌ది. ఆమె మ‌ల‌యాలంలో ప‌లు ప్ర‌ముఖ పాత్ర‌ల‌కు డ‌బ్‌స్మాష్ చేస్తున్న‌ది. ఇప్పటికే డ‌బ్‌స్మాష్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. ఆమెకు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి. త‌న ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజ‌న్లు కీర్తిసురేశ్‌లా ఉందంటూ తెగ పొగిడేస్తున్నారు.

 

నేను శైలజ, నేను లోకల్, మహానటి తో కీర్తి సురేష్ కి తెలుగు లో ఎంతో మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది. వరుస హిట్స్ సాధిస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా నటించింది. కీర్తికి సంబంధించిన కొన్ని సినిమా క్లిప్‌లకు డ‌బ్‌స్మాష్ చేయ‌మ‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు. అంతేకాదు మ‌రియా ఇప్ప‌టికే రెండు షార్ట్‌ఫిలింస్‌, సీరియ‌ల్‌లో న‌టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: