టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. బాబు సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒకరకంగా పండగ అనే విషయం అందరికి తెలిసిందే. సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ముందు రోజే సినిమా హాల్ వద్ద పడిగాపులు పడే పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి గానూ చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎలా అయినా సరే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి అని పట్టుదలగా ఉన్నారు. 

 

ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో తారక్ పాత్ర సగం లోనే చనిపోతుంది అని సమాచారం. తారక్ ని కొందరు చంపేస్తారు అని అంటున్నారు. అక్కడి తో మొదటి పార్ట్ అవుతుంది అని సమాచారం. ఇక రెండో పార్ట్ లో తారక్ కొడుకు గా  ఒక చిన్నాడిని పరిచయం చేస్తారు అని తెలుస్తుంది. 

 

అతన్ని రామ్ చరణ్ దత్తత తీసుకుంటాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు ఈ సినిమా గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు  కచ్చితంగా ఏ మాత్రం కూడా మిస్ అవ్వకుండా చదువుతూ ఉంటారు . ఇప్పుడు ఈ వార్త కూడా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: