స్టార్ హీరోల సినిమాలు అయినా స్టార్ దర్శకుల సినిమాలు అయినా సరే ముందు ఐటెం సాంగ్ అనేది చాలా అవసరం. ఐటెం సాంగ్ లేకపోతే మాత్రం సినిమాకు కమర్షియల్ అనే గుర్తింపు రావడం అనేది కాస్త కష్టమే. అందుకే స్టార్ దర్శక నిర్మాతలు స్టార్ హీరోల సినిమాల విషయంలో అదే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఫాన్స్ కూడా ఐటెం సాంగ్ ఉందా ఉంటే ఎవరు చేస్తున్నారు అంటూ ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప సినిమాలో ఐటెం గర్ల్ గురించి బాగానే చర్చ నడుస్తుంది. 

 

తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ విషయంలో సుకుమార్ ముందు నుంచి దూకుడు  చూపిస్తూ ఉంటాడు. ఆర్య సినిమా నుంచి కూడా ఇదే నడుస్తుంది.  తన గత సినిమా రంగస్థలం ఆయన పూజ హెగ్డే తో ఐటెం సాంగ్ చేయించారు. ఇప్పుడు ఐటెం సాంగ్ ని ఆయన... పాయల్ రాజ్ పుత్ తో చేయించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పాయల్ త్వరలోనే హైదరాబాద్ వస్తుంది అని ముందు ఐటెం సాంగ్ ని పూర్తి చేస్తారు అని అంటున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

 

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సినిమా షూటింగ్ లు చేసే పరిస్థితి అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి. మరి ఈ సినిమా షూటింగ్ ని ఎప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంది అనే దాని మీద ఇంకా స్పష్టత మాత్రం రావడం లేదు. పుష్ప సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఫాన్స్ లో ఫుల్ జోష్ ని పెంచిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: