అనుష్క దాదాపు పది సంవత్సరాల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో దేవసేనగా ప్రేక్షకులని ఆకట్టుకున్న స్వీటీ అనుష్క సినిమాల్లోకి రావడానికి ముందు యోగా టీచర్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడానికి కారణం.. అనుష్క మరోసారి యోగా పై సీరియస్ గా దృష్టి పెట్టిందని అంటున్నారు. ఈమె సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఆరోజుల్లో కష్ట పడి మరీ లావై పోయిన సంగతి తెలిసిందే.  

అయితే ఆమె ఆ లావును తగ్గించుకోడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె పూర్తిగా లావు అయితే తగ్గలేదు. ఆ తరువాత చేసిన సినిమాలకు కూడా కాస్త బబ్లీ లుక్ కావాల్సి రావడంతో ఆమె కొంత మేర మాత్రమే తగ్గింది. అయితే ఇప్పుడు ఆమె పూర్తిగా బరువు తగ్గే పనిలో పడినట్టు ప్రచారం జరిగింది. ఏకంగా ఆమె మిర్చిలో కనిపించిన లుక్ లోకి మారాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అందుకు ఆమె తన యోగా మార్గాన్నే ఎంచుకున్నట్టు కూడా ఈ ప్రచారం జరిగింది. అయితే అదేమీ నిజం కాదని అంటున్నారు. ఆమెకు బరువు తగ్గే ఉఒచన అసలు ఏమాత్రం లేదని అంటున్నారు. ఇక మొన్నీమధ్యనే అనుష్క ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్నానని పేర్కొంది.అయితే ఆమె బరువు తగ్గక పోవడం ఆమె ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె సన్నబడితే మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయని భావించిన ఫ్యాన్స్ కి ఇది కాస్త షాకింగ్ అంశం అనే చెప్పాలి.  ఆ రెండు సినిమాలు ఏవి అనేది ఇంకా తేలకపోయినా రకరకాల సినిమాల కాంబినేషన్స్ అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక మరి ఆమె ఏమేం ఫైనల్ చేసిందో ఏమేం సినిమాలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: