బాహుబలి సినిమాలతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు దర్శకుడు రాజమౌళి. ఆ సినీమాతో తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో నెలబెట్టాడు. అయితే బాహుబలి తర్వాత ఓ కమర్షియల్ సినిమా తీయాలి అని అనుకున్న రాజమౌళికి.. తన తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ పవర్ఫుల్ కథను ఇచ్చాడు.దాన్ని ఎలాగైనా తీయాలి అనే పట్టుదలతో టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో rrr అనే సినిమాను ప్రకటించాడు.  చరిత్రలోని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రాజమౌళి రాసుకున్న ఫిక్షనల్ కథ ఇది.నిజానికి చరిత్రలో వీరిరువురికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ అంతటి వీరులు ఒకరినొకరు కలుసుకుని ప్రభావితం చేసుకుంటే ఎలా ఉంటుందనేదే జక్కన రాసుకున్న కథ.

అయితే ఇటీవలే సినిమా నుండి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ తాలూకు టీజర్ విడుదలైంది. టీజర్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందరూ. కానీ టీజర్ చివర్లో తారక్ తలపై టోపీ పెట్టుకుని ముస్లిం వేషధారణలో కనిపిస్తారు. ఇదే వివాదానికి దారితీసింది. నిజాం రాజుల మీద, రజాకార్ల మీద యుద్ధం చేసిన భీమ్ ఇలా ముస్లిం టోపీ పెట్టుకుని కనిపించడం ఏమిటని ఆదివాసీలు మండిపడుతున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని, చరిత్రను వక్రీకరిస్తే సినిమా విడుదలయ్యాక థియేటర్ల మీద దాడిచేస్తామని ఆదివాసీలు హెచ్చరిస్తున్నారు.

కానీ సినిమాలో కొమురం భీమ్ ప్రతిష్టకు భంగం కలిగించే సన్నివేశాలేవీ ఉండవని, సినిమా చూసాక ఎన్టీఆర్ తలా మీద టోపీ ఎందుకు ఉందనేది అర్థమవుతుందని చిత్ర సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అలాగే సినిమాలో భీమ్ పాత్ర అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో ఉంటారని, వాటిని తొలగించడం కుదరదని కూడ తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వివాదం మీద అటు  రాజమౌళి కానీ..ఇటు చిత్ర నిర్మాత కానీ ఇప్పటివరకు  స్పందించనేలేదు.దీన్ని బట్టి మొత్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ముస్లిం గెటప్ కు సంబంధించిన సీన్ లను తొలగించడం జరగదని అర్ధమవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: