బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ తో ప్రేమాయణం నడిపిన పునర్నవి నిన్న ఇన్ స్టాగ్రాం లో ఎంగేజ్మెంట్ రింగ్ తో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ బ్యూటీ నిజంగానే పెళ్ళికి రెడీ అయ్యిందని అనుకున్నారు. రాహుల్ తో బిగ్ బాస్ హౌజ్ లో పునర్నవి నడిపించింది అంతా డ్రామానే అని.. హౌజ్ నుండి బయటకు వచ్చాక వారిద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలాఉంటే ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అంటూ పునర్నవి పెట్టిన ఆ పిక్ కు విశేష స్పందన వచ్చింది.

అయితే పునర్నవి ఇది కేవలం ఓ వెబ్ సీరీస్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తుంది. సినిమాలతో పాటు హీరోయిన్స్ అంతా వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తున్నారు. పునర్నవి కూడా లేటెస్ట్ గా ఓ వెబ్ సీరీస్ నటిస్తుంది. పునర్నవి మ్యారేజ్ అంటూ నిన్నటి నుండి సోషల్ మీడియా అంతా హడావిడి చేసింది. తీరా చూస్తే అది ఆమె చేసే వెబ్ సీరీస్ కు ప్రమోషన్ అని తెలుస్తుంది.

ఇంతకీ పునర్నవికి రింగు తొడిగిన ఆ ఆన్ స్క్రీన్ లక్కీ గాయ్ ఎవరు అంటే చికాగో సుబ్బారావు అలియాస్ ఉద్భవ్ రఘునందన్ అతను కూడా వెబ్ సీరీస్ లలో చేస్తూ వస్తున్నాడు. పునర్నవి చేస్తున్న కొత్త వెబ్ సీరీస్ లో ఆమెకు పెయిర్ గా ఉద్భవ్ నటిస్తున్నారు. ఈ ఇద్దరి జోడీ సూపర్ గా ఉంటుందని అంటున్నారు. అంతా బాగుంది కాని జస్ట్ వెబ్ సీరీస్ కోసం పునర్నవి ఇలా ఎంగేజ్మెంట్ అని ఆడియెన్స్ ను బకరా చేయడం మాత్రం షాక్ ఇస్తుంది.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: