ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్లకి జూనియర్ ఎన్టీఆర్, నాని ఇంకా నాగార్జునలు హోస్టులుగా వ్యవహరించారు. ఈ సారి నటసింహం బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహిస్తున్నాడు అంటే.... ఏంటి బాలయ్య బిగ్ బాస్ హోస్టా మతి ఎమన్నా పోయిందా... అయన తన ఫ్యాన్స్ ఫోటో అడిగితేనే గూబ గుయ్యిమనిపించాడు. అలాంటిది బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వస్తే ఇంకేమైనా వుందా.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇక దబిడిదిబిడే.. మాములుగా చిన్న తప్పు జరిగితేనే బాలయ్య బాబు తట్టుకోలేరు. ఇక ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో లో గొడవలు కొట్లాటలు జరిగితే ఊరుకుంటాడా.. ఒక్కొక్కరిని వాయించడు. అలాంటి బాలయ్యబిగ్ బాస్ షో కి హోస్ట్ గా వస్తాడా... ఆయన హోస్ట్ గా వ్యవహరించే అవకాశమే లేదు.. అని అనుకుంటున్నారా..! ఇది జరగని పని అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు కానీ.. బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కి మాత్రం బిగ్ బాస్ హోస్ట్‌గా బాలయ్యను చూడాలని ఉందంట. ఏంటి?? కామెడీ చేస్తున్నాడా.. రాహుల్ అంటే ఇంచు మించు అలాంటిదే.నాగార్జున హోస్ట్‌గా.. చిరంజీవి గెస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అవార్డ్ అందుకున్న రాహుల్‌కి ఓ విచిత్రమైన కోరిక ఉందట.


తాజాగా ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యను బిగ్ బాస్ హోస్ట్‌గా చూడాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టాడు. ఎలాగూ మనోడు మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే పరిస్థితిలేదు కనుక ఇలాంటి సాహసోపేతమైన కోరికను కోరాడో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఉన్న హీరోలు, హీరోయిన్లలో బిగ్ బాస్ హోస్ట్‌గా ఎవరైతే బాగుంటుందని యాంకర్ అడగడంతో ‘బాలకృష్ణ సార్ బిగ్ బాస్ హోస్ట్‌గా చేస్తే బాగుంటుంది.. ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్‌ గజగజ వణుకుతారంటూ’ ఫన్నీ కామెంట్స్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: