సెలబ్రిటీ స్టార్ డం ఉన్నన్ని రోజులు అందరికి స్వర్గయం. కానీ ఒక్కసారి ఫాల్ డౌన్ అయ్యారా ఇంకా అంతే సంగతులు.. మల్లి పైకి లేచే అవకాశం తక్కువ మందికే వస్తుంది.  అలాగే నాలుగు సినిమాలు నడుస్తున్నప్పుడే ఆ నటి ని లేదా హీరో ని నెత్తిన పెట్టుకుంటారు. షూటింగ్ లొకేషన్ లో సకల సదుపాయాలు కలిగిస్తారు. కానీ వెలుగు తగ్గిన వారి కోసం ఎవ్వరు ఏమి చేయరు. ఇందుకు ఉదాహరణ సిల్క్ స్మిత. అప్పుల బాధ, అయిన వాళ్ళ మోసం, వెరసి ఫ్యానుకు వేలాడింది. ఇక ఒకప్పుడు షూటింగ్ లో బిస్లరీ వాటర్ ఇవ్వలేదని యూనిట్ బాయ్ ని చాచి లెంప కాయ కొట్టింది. అంతా స్టార్ డం చూసింది. డబ్బులు ఉన్నన్ని రోజులు ఆమె చుట్టూ జనం ఉన్నారు. ప్రొడ్యూసర్లు దర్శకులు కాపు కాసారు. ఎక్కడ కనిపించిన అభిమానులు చప్పట్లు కొట్టి స్వాగతించారు. కానీ ఆమె పోతే ఆసుపత్రి మూలాన ఒక గదిలో ఈగలు దోమలు ముసిరాయి తప్ప మనిషి లేడు. ఎంతటి నిర్దయ ఈ సినిమా ప్రపంచానికి అని ఏడ్చినా అభిమానులు ఉన్నారు.

ఇప్పటికి సిల్క్ పాట వస్తుంటే కళ్లు పెద్దవి చేసుకొని చూస్తారు. కానీ దీపం ఆరకుండా వెలిగించడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. ఆమె కన్ను మూసినా రోజు ఆసుపత్రి ముందు ఒక పెద్దావిడ మాత్రమే ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎవరు అని చాల మంది ఆరా తీశారు. సిల్క్ ని పెంచి పెద్ద చేసింది ఆవిడే. ఆమె పేరు అన్నపూర్ణమ్మ. సినిమాల్లో నటించాలనుకున్న సిల్క్ ని చెన్నై కి తీసుకెళ్లి అందాలన్నీ ఎక్కించింది. డబ్బు, పేరు, ఏది ఆశించకుండా ఆమె పక్కనే ఉంది. ఇక చివరి వరకు కంటికి రెప్పలా అయితే చూసుకుంది కానీ సిల్క్ చేస్తున్న తప్పులని ఆపలేకపోయింది. ఇక సిల్క్ చివరి మజిలీలో ఆమెపై వాలుతున్న ఈగలను తోలుతూ ఆమె పక్కనే ఉంది. ఏది ఏమైనా నా అన్నవాళ్ళు అంటే వీరు మాత్రమే.

సిల్క్ స్మిత జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టూ అవర్ వెబ్  సైట్ 

మరింత సమాచారం తెలుసుకోండి: