థియేటర్స్‌ తెరుచుకున్నా.. మన హీరోల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. థియేటర్స్‌ తెరుచుకుంటే.. రెస్పాన్స్‌ ప్రజల నుంచి రావాలి కదా. హీరోస్‌ నుంచి ఎలా వస్తుందంటారా?  కరోనా భయంతో.. ప్రపంచం అల్లాడుతోంది. 8 నెలల తర్వాత థియేటర్స్ తెరుచుకున్నా.. వెళ్లి  చూడాలంటే.. కరోనా భయం వెంటాడుతోంది. అందులోనూ కొత్త సినిమాలు లేవు. పాత సినిమాలనే రిపీట్‌ చేస్తున్నారు. ముందు హీరోలు థియేటర్స్‌కు వెళ్లి జనాల్లో ధైర్యం నింపాలి. కానీ.. మన స్టార్స్‌ మాత్రం పట్టించుకోవడం లేదు.

హైదాబాద్‌లో థియేటర్స్ తెరుచుకున్నాయి. మహేశ్‌బాబు భాగస్వామి అయిన ఎ.ఎంబి సినిమాస్‌ ఓపెన్‌ అయింది. ఈ విషయాన్ని  స్వయంగా హీరోనే ప్రమోట్‌ చేశాడు. సరిలేరునీకెవ్వరు మూవీని మళ్లీ రీ రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉన్నా.. మహేశ్‌ స్వయంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తే.. ఫ్యాన్స్‌లోనే కాదు.. సినీ ప్రియుల్లో ధైర్యం నింపినవాడు అయ్యేవాడు.

సినిమా ఇండస్ట్రీ లేకపోతే తాము లేమన్న సంగతి హీరోలకు తెలీంది కాదు. అమీర్‌ఖాన్‌ ఆమధ్య థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాడు. ఇలా మనవాళ్లూ ప్రమోట్‌ చేస్తారని ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్స్‌ ఆశించారు.  మన థియేటర్స్‌ మళ్లీ కళకళలాడాలంటే.. ముందు హీరోలు  బైటకురావాలి. మన స్టార్స్‌కు ఇలాంటి ప్లాన్‌ లేకపోయినా..  తేజు మాత్రం ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌కు వెళ్లి 'లెనెట్' సినిమా చూశాడు. ఎనిమిది నెలల తర్వాత వెండితెరపై సినిమా చూడడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నాడు తేజు.

తేజుతోపాటు.. దర్శకుడు మారుతి కూడా సినిమా చూశాడు. థియేటర్స్‌కు వస్తుంటే.. మళ్లీ తమ జీవితాల్లోకి వచ్చిన అనుభూతినిచ్చిందన్నారు మారుతి. తేజు నటించిన సోలో బతుకే సో బెటర్‌ ఈనెల 25న రిలీజ్‌ అవుతోంది. సంక్రాంతికి రెడ్‌.. రంగ్‌దే.. క్రాక్‌.. అరణ్య వంటి సినిమాలు రెడీ అవుతున్నాయి. ఓపెన్‌ అయిన థియేటర్స్‌కు వచ్చే రెస్పాన్స్‌ బట్టి రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేయాలనుకుంటున్నారు. ముందు సినిమాలు రావాలంటే.. ఆల్రెడీ ఓపెన్‌ అయిన థియేటర్స్‌కు జనాలను రప్పించాలి. పెద్ద హీరోలు థియేటర్స్‌కు వచ్చి సందడి చేస్తే..  జనాల చూపు మళ్లీ థియేటర్స్‌పై పడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: