మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం "క్రాక్" బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. దాదాపుగా 10 సంవత్సరాల నుండి సరైన హిట్స్ లేని రవితేజ స్టార్ రేస్ నుండి ఫెడ్ అవుట్ అయిపోయే క్రమంలో క్రాక్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ విడుదల పది రోజులు దాటిన ఇంకా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాకు పోటీగా వచ్చినా మూడు సినిమాలను దాటుకుని మాస్ మహారాజ్ సంక్రాంతి విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఇదే జోష్ ను కొనసాగించేందుకు తన తరువాతి చిత్రం "ఖిలాడి" సినిమాను కూడా పక్క మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

 రమేష్ వర్మ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా 50 శాతం పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా పక్కా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ సీన్ కు నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ కథ ప్రకారం ఓ సన్నివేశంలో లిప్ లాక్ డిమాండ్ చేసిందట కానీ మాస్ మహారాజ్ మాత్రం అందుకు నో చెప్పినట్టు తెలుస్తుంది.తాను అలాంటి సీన్స్ చెయ్యనని సినిమా క్లీన్ గా ఉండాలని చెప్పారట.

రవితేజ గత సినిమాల్లో కూడా లిప్ లాక్ సీన్లకి నో చెప్పారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి అలాగే ఏ ఎస్ స్టూడియోస్, పెన్ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఖిలాడి" సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజ్ "క్రాక్" సినిమా ఇచ్చిన సక్సెస్ కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: