రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలు వరసపెట్టి క్యూలో ఉన్నాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా చేస్తున్నాడు. ఇందులో బాణం పట్టిన మర్యాద పురుషోత్తముడిగా ప్రభాస్ కనిపిస్తారు. దేవుడి కధ, పౌరాణిక గాధ. అందువల్ల ఈ మూవీలో టెక్నికల్  వాల్యూస్ ఎలా ఉంటాయి అన్న దాని మీదనే చర్చగా ఉంది.

ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో వస్తున్న మూవీ సలార్. ఈ మూవీ టైటిల్ చూస్తేనే పవర్ ఫుల్ గా ఉంది. మరి ఇందులో ప్రభాస్ పాత్ర ఏంటి అంటే దాని మీద హాట్ హాట్ చర్చ ఓ వైపు సాగుతూండగానే ఈ మూవీ గురించి   వస్తున్న అప్ డేట్స్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కి కొత్త హుషార్ తెప్పిస్తున్నాయట. ఈ మూవీలో ప్రభాస్ మాఫియా డాన్ రోల్ లో ఫుల్ ఆఫ్ ఎనర్జీతో  కనిపిస్తారు అంటున్నారు.

ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఓరియెంటెడ్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని అంటున్నారు. ఈ మూవీ కధ విషయంలో ఎక్కడా రాజీ పడడంలేదని కూడా చెబుతున్నారు. అంతే కాదు, ప్రభాస్ క్యారక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా మలచారని  అంటున్నారు. కంప్లీట్ గా హాలీవుడ్ రేంజిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు.

ఈ మూవీతో ప్రభాస్ రేంజి ఇంతకు పదిరెట్లు పెరుగుతుందని అంటున్నారు. సరైన సమయంలో ప్రభాస్ కి పడిన సరైన సినిమా అంటున్నారు. ఈ మూవీ విషయంలో ఫలనా సినిమా రీమేక్ అంటూ వస్తున్న వార్తల మీద కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గట్టిగానే క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ కధను తాను సొంతంగా తయారు చేశానని, ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశానని చెబుతున్నారు. ఏది ఏమైనా కేజీఏఫ్ 2 టీజర్ తో కేక పుట్టించినప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో తీసే మూవీ అంటే అంచనాలకు కూడా అందనంత ఎత్తులో ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: