టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పటిలా వరుస సినిమాలు చేయడం లేదు. పెళ్లి అయిన నాటి నుంచి ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ చాలా తక్కువ సంఖ్యలో చేస్తుంది. నిజానికి ఈమె ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. తెలుగులో ఇది ఒక్కటే సినిమా కాగా తమిళంలో మరో సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.. అయితే ఈ రెండు సినిమాలు తప్ప ఆమె మరే సినిమాలు ఒప్పుకునే లాగా కనిపించడం లేదు. నిజానికి ఇదే అంశం మీద కొన్ని నెలల క్రితం ఆమె సినిమాలకు గుడ్ బై చెబుతోంది అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. 

అయితే ఈ విషయం మీద అప్పట్లో సమంత సీరియల్ కూడా అయింది. తను అంటే గిట్టని వారు ఎవరూ ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు గుప్పించింది.అయితే ఏమైందో ఏమో ఆమె సినిమాలు ఒప్పుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి 2017 లోనే నాగచైతన్యతో సమంతకు వివాహమైంది. అప్పటి నుంచి ఏ సినిమా పడితే ఆ సినిమా ఆమె ఒప్పుకోకుండా కేవలం నటన ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ లు మాత్రమే చేస్తోంది. అయితే మరో ఏడాది తర్వాత పూర్తిగా నటనకు ఆమె గుడ్ బై చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. 

ఇప్పటికే ఆమె పలు రకాల వ్యాపారాలు మొదలుపెట్టింది. తన మేనేజర్ చేత ఒక సినిమా కూడా నిర్మింప చేస్తోంది. సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సమంత మేనేజర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దాని వెనుక సమంత హ్యాండ్ ఉందని కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయా తెలీదు కానీ సమంత సినిమాలు ఒప్పుకోకపోవడంతో ఆమె సినిమాలో మానేస్తుంది అంటూ ప్రచారం జరగడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: