కన్నడ కస్తూరి రష్మిక మందన తాజాగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలిగా రావాలని అనుకుంటున్నానని ఆమె తాజాగా వ్యాఖ్యానించింది. ఆమె మాటవరసకు ఆ స్టేట్ మెంట్ ఇచ్చిందో లేక తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి అలా చెప్పుకొచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఆమె మీద కొత్త రకం పుకార్లు కూడా రావడానికి ఆ కామెంట్ కారణం అవుతోంది. ఆమె ఎవరైనా తమిళ వ్యక్తితో ప్రేమలో పడిందా అని అనుమానాలు సైతం ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కన్నడలో కిరాక్ పార్టీ పేరుతో రిలీజ్ అయిన సినిమా ద్వారా రష్మిక తెరంగ్రేటం చేసింది. ఆ సినిమాలో ఆమెను చూసిన చలో దర్శకుడు వెంకీ కుడుముల ఆమెకు తెలుగులో అవకాశం ఇచ్చాడు. 


ఇక మొదటి సినిమా చేసిన రక్షిత్ శెట్టితోనే అప్పటికే ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.. అయితే తెలుగులో సహా ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న నేపథ్యంలో వీళ్లు పెళ్లి వాయిదా వేసుకున్నామని అప్పట్లో ప్రకటించారు.. ఆ తర్వాత బ్రేకప్ అయిందని రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వచ్చాయి కానీ ఈ ఇద్దరూ ఈ అంశం మీద ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆమె కామెంట్ నేపథ్యంలో ఆమె ఒక తమిళ వ్యక్తితో ప్రేమలో పడిందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ భామ తమిళంలో బిజీ కావడానికే తమిళుల కోడలిని కావాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది అని అంటున్నారు. 


నిజానికి ఆమెకు ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి, తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయినా సరే కన్నడంలో కంటే తమిళంలో మార్కెట్తో పాటు రెమ్యూనరేషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తమిళుల ఫోకస్ తన మీద పడేలా చేసుకునేందుకు గాను ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించి ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఇక రష్మికను ఈ విషయం మీద స్పందన కోరితే తమిళ వంటకాల రుచి నచ్చడంతోనే అలా అన్నానని ఇందులో పెద్దగా బూతద్దం పెట్టుకుని వెతకాల్సిన ఏమీ లేదని ఆమె చెబుతోంది. మొత్తం మీద ఆమె తమిళ ప్రేమ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: