కమెడియన్ పాత్ర సినిమాలో కేవలం చిన్న పాత్ర మాత్రమే. సినిమా కథ మొత్తం హీరో, హీరోయిన్ అలాగే విలన్ ల మధ్య కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిత్రం మాత్రం కేవలం కమెడియన్ మీద మాత్రమే ఆధారపడి ఉండడం వల్ల ఈ పాత్రకు బాగా డిమాండ్ పెరిగింది. అయితే ఈ కమెడియన్ వల్ల ఒక దర్శకుడు కోట్లల్లో నష్టాన్ని కొని తెచ్చుకున్నారట.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ?ఆ కమెడియన్ ఎవరు ?ఆ కమెడియన్ వల్ల ఎందుకు అన్ని కోట్ల రూపాయల నష్టం కలిగింది ?అది ఏ సినిమాకు ?అన్న విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


మొదటిసారి కమెడియన్ వడివేలుని హీరోగా, సినీ ఇండస్ట్రీకి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో "హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి" చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ  విజయవంతం అవడంతో ఇక తమిళ్ లో తీసిన ఈ సినిమా టీం తోనే ఈ సినిమా సీక్వెల్ ను నిర్మించాలనుకున్నారు దర్శకుడు శంకర్. అయితే అప్పట్లో ఈ సినిమా సీక్వెల్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించారా ? అని అనుకుంటే అవుననే చెప్పాలి.

వివాదాల విషయానికి వస్తే, షూటింగ్ కూడా మొదలై కొంతభాగం పూర్తయిన తరువాత , సీక్వెల్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేయడంతో నటుడు వడివేలు షూటింగ్లో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. ఇక వడివేలు అలాగే దర్శకుడు శంకర్ కు మధ్య తలెత్తిన వివాదాలు నేరుగా నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. నటుడు సీక్వెల్ సినిమాలో సగం వరకు నటించి , మిగతా సగాన్ని నటించడానికి రాలేదని, వడివేలు కారణంగా రెండు కోట్ల రూపాయల నష్టం కలిగిందని శంకర్ ఫిర్యాదు చేశారు. దీంతో వడివేలు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు . ఇక వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని నిర్మాతల మండలి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.


దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ స్థాపకుడు ఐసరి గణేష్ వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలను తొలగించారని సమాచారం వినిపిస్తోంది. ఇక దర్శకుడికి కలిగిన నష్టాన్ని తీర్చడానికి వడివేలు ఒప్పుకున్నట్లు, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుంది..అని ప్రేక్షకులు నాటి నుంచి నేటి వరకు ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం.


మరింత సమాచారం తెలుసుకోండి: