టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ.. ఆ పాత్ర కోసం తనను తాను మార్చుకోవడానికి ఎంతో శ్రమిస్తుంటాడు తారక్. అయితే తన కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు. ముఖ్యంగా తాను నటించిన ఆది, నాగ, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ వంటి సినిమాలలో చాలా లావుగా కనిపించాడు.ఇక అప్పటికే ఎన్టీఆర్ బరువు గురించి ఇండ్రస్టీ లో ఓ నెగిటివ్ టాక్ నడుస్తూనే ఉంది. ఇక ఆ తర్వాత ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయిన ఎన్టీఆర్.. ఎంతో కష్టపడి బరువు తగ్గి,అందరికి షాక్ ఇచ్చాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'కంత్రీ' సినిమాలో చాలా సన్నగా కనిపించాడు తారక్. ఇక ఆ తర్వాత నుంచి డైట్ ని మెయింటైన్ చేస్తూ ఎక్కువ లావు కాకుండా జాగ్రత్తపడ్డాడు.ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో కనిపించడానికి చాలానే కష్టపడ్డాడు.ముఖ్యంగా కొమురం భీమ్ ల కనిపించడానికి బరువు కూడా తగ్గాడు.దీనికోసం స్పెషల్ డైట్స్ ని మైంటైన్ చేసాడు ఎన్టీఆర్ దాంతో మళ్ళీ సన్నగా మారిపోయాడు.ఇక ఇప్పుడు మళ్లీ బరువు పెరగబోతున్నాడట ఈ నందమూరి హీరో.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమా కోసం బరువు పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ తల్లి మాత్రం చాలా భయపడుతుందట. ఎన్టీఆర్ బరువు పెరగడం తన తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు.మరి తన తల్లి మాట కాదని ఎన్టీఆర్ బరువు పెరుగుతాడా?లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలిన్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల మేకింగ్ వీడియో ని విడుదల చేయగా.. దానికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమాను ముందు అనుకున్న సమయం దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: