సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్క జనరేషన్ లో కొంత మంది గాయనీ గాయకులు వచ్చి , తమ పాటలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటారు. అలా 2000 - 2010 దశకంలో శ్రావణ భార్గవి, గీతా మాధురి, మాళవిక వంటి ఎంతో మంది స్టార్ సింగర్స్ వచ్చి, తమ మధురమైన గానాలతో ప్రేక్షకులను మైమరపింపచేస్తూ వచ్చారు.. వీరిలో ముఖ్యంగా శ్రావణ భార్గవి గురించి తెలుసుకోవాల్సిందే.. మొదట గాయనిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయి, ఆ తర్వాత అనువాద కళాకారిణిగా, గీత రచయిత్రి గా మంచి గుర్తింపు పొందింది.. ఇక ఎన్నో చిత్రాలలో పాశ్చాత్య శైలిలో కూడా పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంది.

ఇక ప్రముఖ గాయకుడు, అలాగే సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన హేమచంద్ర ను ప్రేమ వివాహం చేసుకుంది. అంతేకాదు బిగ్ ఎఫ్ఎం రేడియో కార్యక్రమానికి కూడా రేడియో జాకీగా కూడా పనిచేస్తుంది. ఇక ఈమె జీవిత విశేషాల గురించి తెలుసుకుంటే.. 1989 వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది.. కానీ విద్యాభ్యాసం మాత్రం హైదరాబాదులో లో పూర్తి చేయవలసి వచ్చింది.. ఈమె చదువుతున్న సమయంలోనే సంగీతంపై మక్కువ ఉండడంతో , ఒకవైపు సంగీత శిక్షణ తీసుకుని పలు కార్యక్రమాలలో పాటలు పాడి, విజేతలకు బహుమతులు కూడా గెలుచుకుంది..

అంతేకాదు కొన్ని పాటలను ఈమె స్వయంగా రచించింది కూడా..ఇక ఆ తర్వాత ఈ పాటలు విన్న పలువురు సంగీత దర్శకులు, శ్రావణ భార్గవి ని పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. ఇక హైదరాబాదులో ఉన్న విజ్ఞాన్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఎంబీఏ కూడా పూర్తి చేసింది. ఇక  గబ్బర్ సింగ్ , లవ్ ఫెయిల్యూర్ వంటి సినిమాలలో హీరోయిన్లకు గాత్రదానం కూడా చేసింది. అయితే 2014 జనవరి 22వ తేదీన జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.. తన పాటలతో ప్రేక్షకులను మైమరపించి , ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది శ్రావణ భార్గవి.



మరింత సమాచారం తెలుసుకోండి: