టాలీవుడ్‌లో మోస్ట్ డిసైరబుల్ జంట ఎవరు అంటే గుర్తుకు వచ్చే జంట నాగచైతన్య సమంత. కానీ కొన్ని వారాల నుంచి అక్కినేని నాగచైతన్య మరియు సమంత డైవర్స్ తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వినబడుతున్న విషయం అందరికి తెలిసిందే .

సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన మెట్టినింటి పేరు అయిన అక్కినేని పేరును తొలిగించి ఎస్ అనే అక్షరం జోడించడంతో ఈ గుసగుసలకు మరింత బలం చేకూర్చినట్లయింది . అప్పటి నుంచి సమంత నాగచైతన్య విడాకుల టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పవచ్చు. కానీ ఇవేమి పట్టించుకోకుండా నాగ చైతన్య మరియు సమంత వారి వారి పనులలో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ రూమర్స్‌పై నాగ చైతన్య మరియు సమంత ఎవరూ స్పందించకపోవడంతో అక్కినేని అభిమానుల్లో రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయని తెలుస్తుంది. కానీ ఈరూమర్స్‌పై సమంత రోజుకో రకమై ట్వీట్స్‌తో హింట్ ఇస్తుందని తెలుస్తుంది. కానీ నాగచైతన్య మాత్రం స్పందించడం లేదని సమాచారం. అయితే తాజాగా సమంత చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందని తెలుస్తుంది.. ఈ ఒక్క ట్వీట్‌తో వీరిద్దరి మధ్య నిజగానే గొడవలు వున్నాయి అని అనుకోని అభిమానులు ఆందోళన చెందుతున్నారని సమాచారం..

సమంత తాజాగా షేర్ చేసిన ఇంగ్లీష్ కొటేషన్స్ వైరల్ అవుతున్నాయని సమాచారం.అవి నాగ చైతన్యను ఉద్దేశించి చేసినవేనా? అనే అనుమానం కలుగుతోందని తెలుస్తుంది.. నువ్వు నన్ను బాధపెట్టి వుండొచ్చు అలాగే నేను నిన్ను బాధ పెట్టి వుండొచ్చు. అదేవిధంగా ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని వుండొచ్చు.చివరికి రియాల్టీ ఇదే. అంటూ డ్సమంత కొటేషన్స్ పోస్ట్ చేసిందని తెలుస్తుంది.ఇక కాలమే దీనికి సమాధానం చెప్తుంది అన్న రీతిలో మరో పోస్ట్ పెట్టిందని సమాచారం.వసంత కాలాన్ని పొందాలంటే శిశిరాన్ని కూడా మనం భరించాలి అంటూ తన ప్రస్తుత పరిస్థితిని చెబుతోన్నట్టు మరో పోస్ట్ పెట్టిందట సమంత. దీంతో అక్కినేని అభిమానులు ఆందోళన మొదలైందని తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి వస్తున్న పుకార్లకు సమంత హింట్ ఇచ్చిందని అందరు అనుకుంటున్నారట., అందుకే సమంతకొటేషన్స్ ద్వారా చైతన్యకు వార్నింగ్ ఇచ్చిందని కొందరు అనుకుంటున్నారని సమాచారం. అయితే జనాలకి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఇన్ డైరెక్ట్ విమర్శలు చేయడం సమంత ఒక్కదానికే కాదు అక్కినేని ఫ్యామిలీకి అగౌరవమే అంటున్నారట చాలా మంది.మరీ ఈ అనుమానాలు తీరిపోవాలన్నా అలాగే ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాలన్న సమంత నాగ చైతన్య ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలంటున్నారట అక్కినేని అభిమానులు. మరీ వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: