నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తిచేసి విడుదల చేసేందుకు రెడీగా ఉంచాడు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్టేజ్ షూటింగ్ గోవాలో ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది.

ఇక  సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నాడు బాలకృష్ణ. ఇది తనకు తప్పకుండా మంచి విజయం సినిమా చేకూరుస్తుందని భావిస్తున్నాడు. ఆయన గత కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం తో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ సాధించి తన అభిమానులకు మంచి కానుక ఇవ్వాలని ఆయన భావిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఇటీవలే ఈ సినిమాలోని పాట కూడా చిత్రబృందం విడుదల చేయగా మెలోడీ పాట గా వచ్చిన ఈ ఈ పాటను ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. 

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా క్రాక్ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా మాస్ ఎలిమెంట్స్ తో అద్భుతమైన కథ రెడీ చేశాడట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా లోని ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. అఖండ సినిమాలోని రెండు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న బాలకృష్ణ ఈ సినిమాలో మూడు అదిరిపోయే పాత్రలతో ప్రేక్షకులను మెప్పించనున్నాడట. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: