మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ గా మారింది. ఆయన తప్పకుండా విజయం సాధిస్తారు అని చాలామంది అన్నారు. అందుకే దాదాపు రెండు వందల ఎనభై ఓట్లు ఆయనకు పడ్డాయి. అయితే తన ఓటమికి మనస్థాపం గా ఆయన మా సభ్యత్వానికి రాజీనామా చేయగా దీని వేరే అర్థం ఉందని అది ఏంటో త్వరలోనే తెలియజేస్తాం అని ప్రకాష్ రాజ్ తెలిపి ఒక్కసారిగా ఒక సంచలనానికి తెర తీశాడు.

సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా ఆయన మా సభ్యులకు అందరికీ నమస్కారం.. నేను మా సభ్యత్వానికి రాజీనామా చేయడం పట్ల లోతైన కారణం ఉంది.. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచని విధంగా వాటన్నిటినీ కూడా త్వరలోనే మీ అందరికీ వివరిస్తాను అని ఆయన పేర్కొన్నాడు. మొత్తం 18 కార్యవర్గ సభ్యులు ఉండగా పదిమంది విష్ణు కు సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించగా ఎనిమిది మంది ప్రకాష్ రాజ్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే అధ్యక్ష్య పదవి కి అయన ఓడిపోవడం అందరిని నిరాశపరిచింది. 

ప్రపంచంలో ఏ శాసనవ్యవస్థ లో లేని విధంగా గెలిచినవారు ఓడినవారు రెండు వర్గాల లలో ఉన్నవారు కలిసి పని చేయాలి. అలా మా అసోసియేషన్ లో గెలిచిన వర్గం ఓడిన వర్గం కలిసి పనిచేసి మంచి పాలన తీసుకురావాలి కానీ ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో ఒక్కసారిగా అందరూ రాజీనామాలు చేసి ఏకగ్రీవంగా మంచు విష్ణు అభ్యర్థులకే కార్యవర్గాన్ని వదిలేశారు. వారు కూడా రాజీనామా చేయడం ఎవరికీ మింగుడు పడటం లేదు.  మరోవైపు విష్ణు కూడా అధ్యక్షుడిగా నేను ప్రకాష్ రాజ్ రాజీనామా అంగీకరించనని స్పష్టం చేశారు. మరి త్వరలో ఆయన లోతైన విశ్లేషణ చెబుతాను అన్న ఆ విశ్లేషణలో ఎలాంటి నిజాలు ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: