ప్రతి ఒక్కరు ఈ పాట పై డాన్స్ చేయడం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక మరికొంతమంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ఫాలో అవుతూ అదిరిపోయే డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ సైతం పుష్ప స్పూఫ్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవలే జబర్దస్త్ కార్యక్రమం లో భాగంగా హైపర్ ఆది పుష్ప సినిమాకి స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతుంది. అయితే మేము ఏమైనా తక్కువ అనుకున్నారో ఏమో సుడిగాలి సుదీర్ టీం కూడా పుష్ప సినిమాకు స్పూఫ్ చేశారు.
ఈ క్రమంలోనే బుల్లితెరపై సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ పుష్ప గెటప్ లో జబర్దస్త్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో గెటప్ శీను ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో అటు ఆటో రాంప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు. ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా ఏకంగా పుష్ప గెటప్ లో సుడిగాలి సుధీర్ ని చూసి అభిమానులు అందరూ మురిసిపోతున్నారు. మా సుధీర్ అన్న తోపు ఏ గెటప్ వేసిన ఇట్టే ఒదిగిపోతాడు అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉండడం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమో పై ఒక లుక్కేయండి.