టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాన్ని మరియు అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి, అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. 


రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే కూడా  ఎక్కువగా  ఫోకస్ ను బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పైనే పెట్టింది.  అందులో భాగంగా అనేక బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ  సినిమాలకు దూరంగా ఉంటుంది.  ఇలా బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సెలబ్రిటీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్  అయిన డింపుల్ వద్ద శిక్షణ తీసుకున్నారు. 'పసూరి' అనే సాంగ్ కు రకుల్ ప్రీత్ సింగ్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్ ని దక్కించుకుంది. 

ఇప్పటికే యూట్యూబ్ లో సన్సేషనల్ గా మారిన ఈ వీడియో ప్రస్తుతం ఇన్ స్టా లో కూడా వైరల్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన అతి తక్కువ సమయం లోనే అదిరిపోయే వ్యూస్ ను దక్కించుకుంది. ఇలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజా డాన్స్ వీడియో పై తన ప్రియుడు జాకీ భగ్నానీ స్పందించాడు. మై డియర్ లవ్... నాక్కూడా నేర్పించవా... అంటూ రకుల్ ప్రీత్ సింగ్ 
 డాన్స్ వీడియో పై కామెంట్ చేశాడు.
https://www.instagram.com/reel/CfLTiByPp9h/?igshid=MDJmNzVkMjY=

మరింత సమాచారం తెలుసుకోండి: