కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి  ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈయన తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు విజయ్ దళపతి.ఇక ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.. ఇకపోతే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.అయితే ఇటీవలే బీస్ట్ సినిమాతో వచ్చాడు విజయ్. ఇప్పుడు విజయ్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.

ఇక  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.పోతే  ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ సినిమా అలా ఉండగానే విజయ్ లోకేష్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు అనే వార్త కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. అయితే విజయ్ దళపతి తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ తో చేయనున్నాడు.ఇక  ఇటీవలే లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ఇక దీంతో లోకేష్ పై అంచనాలు బాగా పెరిగి పోయాయి.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది. పోతే ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని..  ఈ కథ మొత్తం ముంబై నేపథ్యంలో సాగుతుందని సమాచారం..అయితే  ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి కథ కూడా అలా హై లెవల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు లోకేష్.. ఇకపోతే మరి ఈ సినిమా కథ ఇదేనో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: