విడాకుల తర్వాత హీరోయిన్ సమంత మళ్లీ చిత్రాలలో బిజీ అయ్యేందుకు భారీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఇతర భాషల సినిమాలతో బిజీగా ఉన్న సమంత తెలుగులో పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికైతే ఆమె చేతిలో ఉన్న పెద్ద సినిమా ఇదే అని చెప్పొచ్చు.

ఆ విధంగా సమంత ఈ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇచ్చి మళ్లీ హీరోయిన్ గా అవకాశాలు రాబట్టుకోవాలని చూస్తుండగా ఇదే సమయంలో మరొక పెద్ద హీరో సినిమా లో ఆమె అవకాశాలు దక్కించుకున్నట్లుగా ఇప్పుడు వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. కొరటాల శివ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెలుగు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలు పెట్టుకొని ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే హీరోయిన్ ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో వారి పరిశీలనలోకి సమంత పేరు కూడా వచ్చిందట. 

ఈమె హీరోయిన్ అయితే ఏ విధంగా ఉంటుందో అన్న ఆలోచన కూడా వారు చేస్తున్నారట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా సమంత ఒక హీరోయిన్ గా నటించింది. ఆ విధంగా ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్లో మరొక సినిమా రావడం వారి అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు అయితే సమంత గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు చిత్ర బృందం ఈమెను తమ సినిమాలో ఎంపిక చేసుకుంటే తప్పకుండా మంచి ఆప్షన్ అవుతుంది అని కొంతమంది చెబుతున్నారు. యూత్లో ఆమెకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఇతర భాషలలో సైతం మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఆమెను హీరోయిన్గా ఎంచుకోవడం మంచి విషయమే అని చిత్ర బృందం భావిస్తుందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించబోతోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: