ఏదైనా పండుగ వచ్చింది అంటే కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.అందులో పెద్ద పండగలు వస్తే ఇక చెప్పనక్కర్లేదు సినిమాలు పోటీ పడతాయి.. ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది.. ఈ పండుగకు చాలా సినిమాలు విడుదల కానున్నాయి.ఇకపోతే పెద్ద సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.ఆ తర్వాత వచ్చే సినిమాల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే దసరా సీజన్ అయిపోయాక.. కొన్ని లు విడుదల కానున్నాయి.


అందులో రవితేజ, సమంత లాంటి స్టార్స్ ఉన్నారు. మరి అక్టోబర్ రెండో వారం నుంచి నవంబర్ వరకు రిలీజ్ కాబోయే లేంటి..? అన్‌సీజన్‌ను క్యాష్ చేసుకునే సత్తా ఆ లకు ఉందా..? అక్టోబర్ 5న దసరా సందర్భంగా నాలుగు లు వస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్‌ లోనే సినీ జాతర జరగబోతుంది. ఈ నెలన్నర గ్యాప్‌లో రాబోయే ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకే చాలా తెలివిగా రవితేజ, సమంత లాంటి స్టార్స్ ఈ అన్‌సీజన్‌లోనే వస్తున్నారు. అక్టోబర్ 21న రవితేజ ధమాకా రాబోతుందని తెలుస్తుంది. అక్టోబర్ 24 న దివాళి ఉండటం తో.. మూడు రోజుల ముందే పండగ చేసుకోవాలని చూస్తున్నారు రవితేజ.


నవంబర్ 4న సమంత శాకుంతలం తో వచ్చేస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌ లో శాకుంతలం ను తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత ఆయన చేస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ ఇది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం లో మలయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు గుణశేఖర్. మొత్తానికి దసరా తర్వాత.. డిసెంబర్‌కు ముందు ధమాకా, శాకుంతలంపైనే అందరి చూపు ఉంది..మరి ఈ సినిమాలు ఎంత హిట్ అవుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: