నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసారా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కు మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు.

మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన బింబిసారా మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సాధించుకుంది. దానితో బింబిసారా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు కూడా దక్కాయి. అలా అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న బింబిసార మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది.

ఇలా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ,  అద్భుతమైన కలెక్షన్ లను సాధించిన బింబిసారా మూవీ మరి కొన్ని రోజుల్లోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బింబిసారా మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ  'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి జీ 5  'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జీ 5  'ఓ టి టి' సంస్థ బింబిసారా మూవీ ని అక్టోబర్ 7 వ తేదీ నుండి తమ  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: