తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు డైరెక్టర్లు బాగా ఫెమస్ అయ్యారు.అది కూడా తక్కువ సినిమాలతో.. అలాంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు.. కమర్షియల్ నేపథ్యంలో కామెడీ సినిమాలను తనదైన శైలిలో కామెడీ హ్యూమర్ యాడ్ చేసి… తీస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ప్లాప్ లేని డైరెక్టర్ గా బాగా పాపులర్ అయ్యాడు.ప్రస్తుతం నట సింహం నందమూరి బాలయ్య బాబుతో… డిసెంబర్ నెల నుండి కొత్త సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు.

“NBK 108” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. బాలకృష్ణని చాలా వైవిధ్యంగా అనిల్ రావిపూడి చూపించనున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఓటీటి రంగంలో… చాలామంది దర్శకులు మరియు హీరోలు పలు షోలకు వస్తున్న సంగతి తెలిసిందే. “ఆహా”లో బాలకృష్ణ “అన్ స్టాపబుల్” టాకీ షో దుమ్ము దులుపుతోంది. ఇక ఇదే ఆహా లో… డైరెక్టర్ అనిల్ రావిపూడి ''కామెడీ స్టాక్‌ ఎక్సైంజ్‌'' పేరిట ఓ కామెడీ షోకు జడ్జిగా రాణించటానికి రెడీ అయ్యారు..

కామెడీ షోలో సుడిగాలి సుదీర్, దీపిక పిల్లి యాంకర్స్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో సద్దాం, ముక్కు అవినాష్, తమదైన శైలిలో కామెడీ పండించడం జరిగింది. ఇక ఇదే కామెడీ షోలో భాగంగా ప్రోమోలో యాంకర్ దీపికా పిల్లిని… జడ్జిగా వచ్చిన అనిల్ రావిపూడి స్టేజి పైన ముద్దు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రీతిగా స్టేజ్ పైనే అనిల్ రావిపూడి ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు అన్నది.. డిసెంబర్ రెండవ తారీకు స్ట్రీమింగ్ కాబోయే షో బట్టి తెలియనుంది. మొత్తానికి ఈ వీడియో వైరల్ కావడంతో అనిల్ పై కూడా ట్రోల్స్ మొదలయ్యాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: